హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఘన నివాళి: కలెక్టర్

ADB: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన బాపూజీ 111వ జయంతి వేడుకల్లో పాల్గొని MP నగేశ్‌తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమీకృత కలెక్టరేట్, విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టేలా కృషి చేస్తామని MLA పాయల్ శంకర్ హామీ ఇచ్చారు.