హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

JGL: మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాపూజీ తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన తీరు స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.