హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాపూజీ ఆశయాలే యువతకు స్ఫూర్తి: అ. కలెక్టర్

VKB: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి బాపూజీ పునాదులు వేశారని గుర్తుచేశారు. ఆయన సేవలు, త్యాగాలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయని పేర్కొన్నారు.