HYD: బోరబండలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వేముల శారద(45) అనే మహిళపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. పలుమార్లు అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు డయల్ 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
తెలంగాణ
బోరబండలో మహిళపై పీడీ యాక్ట్


