హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరానికి పెరిగిన గోదావరిలో వరద

E.G: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం రాత్రికి వరద ప్రవాహం 8–9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.