GDWL: వడ్డేపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా వక్తలు, సిబ్బంది స్మరించుకున్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కర్తవ్యమని కొనియాడారు.
తెలంగాణ
వడ్డేపల్లి పురపాలక కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి


