KMR: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డిలో ఆయన విగ్రహానికి అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గ్రంథాలయ ఛైర్మన్ ఉన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన అ. కలెక్టర్


