హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో గుర్తుతెలియని మృతదేహం

కోనసీమ: కొత్తపేట–పలివెల మార్గంలోని పంట కాలువలో నాయుడు మిల్లు సమీపంలో ఆదివారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలువలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.