హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో STలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలి'

CTR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్టీలకు సమచిత ప్రాధాన్యత కల్పించాలని ఎస్టీ సంఘం (ఎరుకుల) జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కోరారు. పుంగనూరు అంబేద్కర్ భవన్‌లో ఎస్టీ సంఘ నాయకులు, కులస్తులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఎరుకుల కులస్తులతో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో పుంగనూరు పట్టణ అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు.