హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపులకు నోటిఫికేషన్..!

KDP: బద్వేలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 6 ఏ4 రిటైల్ మద్యం షాపుల లైసెన్సులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు CI సీతారామిరెడ్డి తెలిపారు. బద్వేలు మున్సిపాలిటీలో 2, బద్వేలు, గోపవరం, బి. కోడూరు, కలసపాడు మండలాల్లో ఒక్కో షాపు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.ఒక్కో షాపుకు రుసుము రూ. 3,01,000గా నిర్ణయించారు. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.