మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం దేపల్లి గ్రామంలో కన్న తండ్రిని కొడుకు కొట్టి హత్య చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. రాపోలు రాములు (55)ను ఆయన రెండో కుమారుడు సురేందర్ కర్ర, రాయితో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన అనంతరం సురేందర్ పరారయ్యాడు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కన్న తండ్రిని కొట్టి చంపిన కొడుకు


