హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడలు.. భారత్‌కు సిల్వర్ మెడల్

ఆసియా క్రీడలు-2026లో భారత స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్ పోరులో అభయ్ సింగ్.. మలేషియాకు చెందిన 'ఎన్జీ ఈన్ యోవ్' చేతిలో ఓటమి పాలయ్యాడు. ఫైనల్లో ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన అభయ్.. వెండి పతకంతో సరిపెట్టుకుని భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చాడు. అతడిపై క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.