KRNL: ఎమ్మిగనూరు పోలీసులు కడిమెట్లలో 40 మంది సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 18 ద్విచక్ర వాహనాలు, రెండు బొలేరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు, సమస్యాత్మక వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అక్రమ కార్యకలాపాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరులో పోలీసుల కార్డన్ సెర్చ్


