KMR: ఖరీఫ్ పంటలకు రెండో తడి అందించేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం ప్రధాన కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు AEE సాకేత్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,401.08 అడుగులు ఉండగా, 12.505 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ ఫ్లో లేదన్నారు.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల


