MHBD:మరిపెడ మండలంలోని అజ్మీర తండా ఆనకట్ట శిథిలావస్థలోనే ఉంది. 1977లో నిర్మించిన ఈ ఆనకట్ట తెగిపోవడంతో సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, కావున ప్రభుత్వం స్పందించి ఆనకట్టను పునర్నిర్మించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఆనకట్ట పునర్నిర్మాణానికి నోచేదెప్పుడు?


