హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊట్కూరులో ఉల్లాస్‌ మూల్యాంకన పరీక్ష

NRPT: ఊట్కూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉల్లాస్‌–నవ భారత సాక్షరతా కార్యక్రమం మూల్యాంకన పరీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల్లోని నిరక్షరాస్య వయోజన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. పరీక్షలో చదవడం, రాయడం, సంతకం చేయడం వంటి అంశాలపై ప్రశ్నలు ఇచ్చారు. విద్యాశాఖ, సెర్ప్‌ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు.