హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యకరమైన జీవనశైలితోనే దీర్ఘాయువు: మంత్రి

E.G: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రాజమహేంద్రవరంలో పల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన 3కె రన్‌లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తిలక్ రోడ్డు నుంచి ఐఎంఏ బిల్డింగ్ వరకు సాగిన ఈ రన్‌లో మంత్రి కొంతదూరం నడిచి పాల్గొనేవారిలో ఉత్సాహం నింపారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు.