హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో '5K రెడ్ రన్' మారథాన్

విశాఖ ఆర్.కే. బీచ్ రోడ్‌లో 17-25 ఏళ్ల యువతకు '5K రెడ్ రన్' మారథాన్ నిర్వహించారు. HIV/AIDS అవగాహనే ధ్యేయంగా DMHO డా. జగదీశ్వరరావు, డా. రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. మహిళల్లో T. వాణి, G. గాయత్రి; పురుషుల్లో చల్లా సురేష్, B. రాజు బాబు విజేతలుగా నిలిచారు. వీరికి రూ.10,000, రూ.7,000 నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు.