హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

ప్రకాశం: కనిగిరిలో జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 304 మంది మహిళలకు ఆదివారం ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. మహిళలు కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని మంత్రి సూచించారు.