కృష్ణా: గుడివాడలో గంజాయి విక్రయాలు, నిల్వలు, వినియోగానికి సంబంధించిన వివరాలు ఉంటే చెప్పాలని, చెప్పిన వారికి రూ. 500 లు నగదు బహుమతిని గుడివాడ వన్ టౌన్ పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. 'జాడ మీరు చెబితే వేట ఈగల్ టీమ్ చూసుకుంటుందని' తెలుపుతూ పోలీసులు ప్రత్యేక పోస్టర్లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి జాడ చెబితే నజరానా..!


