హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పర్యటన

ATP: అనంతపురం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్స్ మిషన్ ఎండీ జి.సి.కిషోర్ కుమార్ ఆదివారం జిల్లా పర్యటనకు విచ్చేశారు. నగరంలోని ఆర్డీటీ అతిథి గృహంలో ఆయనను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల అంశాలు, స్థానిక అభివృద్ధిపై వారు చర్చించారు.