హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ

కృష్ణా: బంటుమిల్లి( M)నరసప్పచెరువు వద్ద సాస్కి నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాస్కి నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణంతో నరసప్పచెరువు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.