హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం'

BDK: చండ్రుగొండ గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో కొత్త విద్యుత్ స్తంభాల నిర్మాణానికి సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి, ఉప సర్పంచ్ అంతటి రామకృష్ణతో కలిసి ఇవాళ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు.