హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సాధించాలి: జోగు రామన్న

ADB: తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్‌లోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి జోగు రామన్న ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సమాజం కోసం బాపూజీ చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తొలి దశ ఉద్యలంలో మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడని గుర్తుచేశారు.