హైదరాబాద్: 28°C
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో సంచలనం సృష్టించిన చిన్నారులు

ఏషియన్ గేమ్స్‌లో పన్నెండేళ్ల లోపు చిన్నారులు సంచలనం సృష్టిస్తున్నారు. జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యూకీ కురిహారా 'పుయో పుయో' వీడియో గేమ్‌లో స్వర్ణం సాధించి ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. తైవాన్‌కు చెందిన 12 ఏళ్ల యాంగ్ స్కేట్‌బోర్డింగ్‌లో రజతం గెలిచాడు. అంతకుముందు చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మర్ యూ జీదీ ఏకంగా మూడు స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది.