హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉధృతి

BHPL: భారీ వర్షాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుండి వరద ఉధృతి పెరిగింది. శనివారం సాయంత్రానికి ప్రవాహం 72,270 క్యూసెక్కులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం బ్యారేజీకి చెందిన 85 గేట్లను పూర్తిగా ఎత్తివేసి, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.