హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాము కాటుతో మహిళ మృతి

VKB: పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన తాండూరు మండలంలో చోటుచేసుకుంది. తాండూరు మండలం మల్కాపూర్‌కు చెందిన ఓ రైతు కంది చేనులో కర్ణాటక రాష్ట్రం కల్లూర్‌కు చెందిన మహిళ కూలీ పనులకు వచ్చింది. చేనులో పనిస్తుండగా అంబికను పాము కాటేసింది. గమనించిన తోటి కూలీలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నాడు.