హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వీధి కుక్కల నియంత్రణకు చర్యలు'

WNP: కొత్తకోట పట్టణంలో వీధికుక్కల సమస్యపై వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలతో కుక్కలను పట్టుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ సైదయ్య తెలిపారు. మటన్, చికెన్ దుకాణాల వ్యాపారులు వ్యర్థాలను బహిరంగంగా వేయకుండా సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపడుతోందన్నారు.