హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులపై దాడులు ఉపేక్షించం: డీఎస్పీ

MHBD: మరిపెడ మండలం తానంచర్లలో వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై 17 మందిపై కేసు నమోదు చేసినట్లు తొర్రూర్‌ డీఎస్పీ కృష్ణకిషోర్‌ శనివారం తెలిపారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పోలీసులపై దాడులు, బెదిరింపులు, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.