హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతి

KMM: పెనుబల్లిలో కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి తోట గౌతమ్ (16) మృతి చెందాడు. శనివారం ఇంట్లో బల్బు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరాడు. పెనుబల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఎస్సై షాకీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.