హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఖమ్మం నగరంలో విద్యుత్ అంతరాయం

ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంప్ 33/11 సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల వల్ల ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్-3 ఏఏఈ జి. వెంకన్న తెలిపారు. దీంతో ఎన్‌ఎస్‌పీ క్యాంప్, కొత్త బస్టాండ్ ఏరియా, ఎంఎల్ పార్టీ ఆఫీస్, విద్యుత్ సరఫరా ఉండదని అన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.