హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నటరాజాసనం వల్ల కలిగే లాభాలు

ఒక కాలుపై నిలబడి చేసే నటరాజసనం వల్ల శరీర సమతుల్యత, మనసులో ఏకాగ్రత మెరుగుపడతాయి. కాళ్లు, చీలమండలు, మోకాళ్లు, తొడలు, తుంటి కండరాలు బలంగా మారుతాయి. శరీరం అంతటా రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఛాతీ తెరుచుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. వెన్నుముక సాగదీయడం వల్ల వంకరలు తగ్గి సరైన శారీరక రూపం సిద్ధిస్తుంది.