హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ జాప్యంపై సీఎంవో ఆగ్రహం

WGL: వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పూర్తికి మరింత గడువు కోరడంపై సీఎంవో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దసరా నాటికి పనులు పూర్తి చేసి ఓపీ సేవలు ప్రారంభించేలా 24 గంటలూ పనులు చేపట్టాలని శనివారం ఆదేశించారు. ప్రస్తుతం నాలుగు అంతస్తులు పూర్తికాగా, మరో నాలుగు అంతస్తుల పనులు దసరా నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.