హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూర్ నగర్‌లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్‌లో నిన్న రాత్రి ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడలిలో కార్లను ఆపి వాహన పత్రాలు, వివరాలను పరిశీలించారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని వాహనదారులకు ఎస్సై సూచించారు.