హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన

KNR: సైదాపూర్‌ మండలంలోని 29 గ్రామాల్లో కొత్త చేయూత పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితి, అర్హతలను పరిశీలిస్తున్నారు. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెన్షన్‌ ఇప్పిస్తామని దళారులు డబ్బులు అడిగితే ఇవ్వవద్దని, సందేహాలుంటే కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.