హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిడ్స్‌పై అవగాహనతోనే సురక్షిత సమాజం: కలెక్టర్

GDWL: ఎయిడ్స్ నియంత్రణలో 'మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష' ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా గుర్తింపు పొందడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులను సత్కరించిన ఆయన, ఐఈసీ (IEC) ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎయిడ్స్ నివారణలో భాగస్వాములైన అధికారులకు కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.