NGKL: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి రానున్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి, కీర్తిశేషులు బీరం లక్ష్మారెడ్డి దశదిన కర్మలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సింగోటం వ్యవసాయ క్షేత్రానికి చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ
నేడు సింగోటం గ్రామానికి రానున్న కేటీఆర్


