హైదరాబాద్: 28°C
క్రీడలు

షాట్‌పుట్‌లో భారత్‌కు రజతం

ఆసియా క్రీడల్లో పురుషుల షాట్‌పుట్ విభాగంలో భారత అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ రజత పతకం సాధించాడు. ఆయన ఐరన్ బాల్‌ను 20.64 మీటర్ల దూరం విసిరి ఈ ఘనత సాధించాడు. గతంలో రెండు స్వర్ణాలు నెగ్గిన ఆయనకు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. ఈ పోటీలో 20.81 మీటర్లు విసిరిన ఇరాన్ అథ్లెట్ మహ్మద్‌ రెజా స్వర్ణం గెలుచుకున్నారు.