హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు మరో స్క్వాష్ పతకం

ఆసియా క్రీడల స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. జోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్ సెమీఫైనల్లో హాంకాంగ్ జోడీ టాంగ్ మింగ్ హాంగ్, లీకాయి చేతిలో 10-11, 11-2, 10-11తో ఓడారు. నిర్ణయాత్మక గేమ్‌లో 10-7 ఆధిక్యంలో ఉన్నప్పటికీ వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయారు. ఈ పతకం జోష్నాకు ఆసియా క్రీడల్లో ఆరో పతకంగా నిలిచింది.