హైదరాబాద్: 28°C
క్రీడలు

రికార్డుకు అడుగు దూరంలో జడేజా

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. భారత్-వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు జడేజాకు మరో వికెట్ మాత్రమే అవసరం. ప్రస్తుతం జడేజా 44 వికెట్లతో వెస్టిండీస్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్‌తో సమంగా ఉన్నాడు. మరో వికెట్ సాధిస్తే ఈ రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు.