SKLM: హీరంమండలం వంశధార నది పరివాహక ప్రాంతాల్లో గత 24 గంటల్లో వర్షపాతం గణనీయంగా తగ్గింది. మొత్తం 58.20 మి.మీ కాగా, సగటు వర్షపాతం 8.31 మి.మీగా నమోదైంది. అత్యధికంగా మహేంద్రగడలో 23.20 మి.మీ ఉండగా, అత్యల్పంగా కాశీనగర్‌లో 0.80 మి.మీ వర్షపాతం నమోదైంది. గొట్టా బ్యారేజ్ వద్ద వర్షపాతం నమోదు కాలేదు. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తగ్గిన వర్షపాతం.. కొనసాగుతున్న వరద


