ASR: కొయ్యూరు మండలం గోపవరం గ్రామంలో డౌనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 104 మొబైల్ మెడికల్ వాహనం ద్వారా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గోపవరం, లింగాపురం, రొబ్బసింగి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
104 వాహనంతో ఉచిత వైద్య సేవలు


