హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన స్పెషల్ ఆఫీసర్లు​

VSP: పెందుర్తి సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల స్పెషల్ ఆఫీసర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండల పరిషత్తుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు.