CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సన్నద్ధతపై సమీక్షించారు. కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష


