హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛలో విజయవాడకు అనుమతి లేదు: ఎస్పీ

GNTR: స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ నెల 27న విజయవాడలో నిర్వహించబోయే చలో విజయవాడ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదని ఎస్పీ వకుల్‌ జిందాల్ పేర్కొన్నారు.  భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో 25 నుంచి 29 వరకు సెలవులు రద్దు చేసినందున ఉద్యోగులు విధులకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.