హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గర్ల్స్ హైస్కూల్‌ను సందర్శించిన డీఈవో

కోనసీమ: జిల్లా విద్యాశాఖాధికారి మహబూబ్ బాషా కొత్తపేట బాలికోన్నత పాఠశాల ను శనివారం సందర్శించారు. ముందుగా పదవతరగతి విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. కొన్ని ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలను రాబట్టారు. అనంతరం అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు.