హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏజెన్సీని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

ASR: భారీ వర్షాలతో ఏజెన్సీలో జనజీవనం దెబ్బతిన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు కోరారు. వరదలు, కొండచరియలు, రోడ్లు, వంతెనలు, ఇళ్లకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించాలని, దెబ్బతిన్న రహదారులను అత్యవసరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.