హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ బంకులో విజిలెన్స్ తనిఖీలు..

అమలాపురం రూరల్ మండలం కామనగరువులోని నయారా పెట్రోల్ బంకుపై శనివారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇంధన విక్రయాలపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇంధన నాణ్యతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో యాజమాన్యాలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు.