హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

CTR: నగరి నియోజకవర్గానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.9,49,763 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ శనివారం పంపిణీ చేశారు. నగరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ, రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడారు.