SKLM: సంతబొమ్మాళి మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, టెక్కలి కోఆర్డినేటర్ కోత మధుసూదనరావు పరిశీలించారు. మూలపేట పోర్టు రోడ్డు నిర్మాణంతో వరదనీరు సముద్రంలో కలవక సుమారు 7,800 ఎకరాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు పొలాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు


